ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

MDK: ర్యాగింగ్ చేయడం చట్ట రీత్యా నేరమని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. 1997 ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. ర్యాగింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పిర్యాదులకు Dial 100 లేదా 08712-657888 నంబరుకు సంప్రదించాలని సూచించారు.