రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

ATP: ఉప్పరపల్లి సమీపంలోని ఏఎఫ్ ఏకాలజీ సెంటర్లో రేపు మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ ఆపై విద్యార్హతలున్న నిరుద్యోగ యువతి, యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.