చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు
విజయనగరం స్థానిక జమ్ముపడాలపేటలోని బేతని మిషన్ చర్చిలో ఇవాళ గుడ్ ఫ్రైడే వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ఆత్మార్పణ, శిలువ వేసిన తర్వాత ఏసుక్రీస్తు మాటలు, మానవాళి శ్రేయస్సు కోసం ఆయన చేసిన ప్రబోధనలను క్రైస్తవులకు వివరించారు. అనంతరం ప్రార్థనలు, శిలువ గీతాలతో ఆరాధనను చేస్తూ ఆత్మీయంగా గడిపారు.