విద్యాశాఖ కమిషనర్‌కు టీచర్ల అభినందనలు

విద్యాశాఖ కమిషనర్‌కు టీచర్ల అభినందనలు

GNTR: ఏపీ నూతన విద్యాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌పై ఆమెకు పలు విజ్ఞప్తులు చేశారు. ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.