జ్ఞానజ్యోతి గురువులకు లయన్స్ క్లబ్ సత్కారం

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ ప్రాంగణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులను ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా లయన్ ఎర్రబెల్లి రాఘవరావు పాల్గొని నేటి బాలలే రేపటి విజయానికి నాంది అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులుగా స్కూల్ బ్యాగులు అందజేశారు.