VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో విష్ పర్వదిన వేడుకలు
AKP: అయ్యప్ప స్వామి విషు పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు పుణ్యాహవాచనం, అష్టోదశ కలశ మండపారాధన, ద్రవ్యాభిషేకాలతో కొనసాగాయి. ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.