తూడిచెర్లలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

తూడిచెర్లలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

NDL: జూపాడు బంగ్లా మండలం తూడిచెర్లలో శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 28న తెలుగు రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీటీసీ నాగమణి సుధాకర్ గురువారం తెలిపారు. ఏపీ, తెలంగాణకు చెందిన జట్లు పాల్గొనవచ్చన్నారు. మొదటి బహుమతి రూ.30,000, రెండో బహుమతి రూ.20,000గా నిర్ణయించారు. క్రీడాకారులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.