నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ భవనం
కాకినాడ జిల్లా తొండంగి మండలం వలసపాకలి గ్రామంలోని ప్రభుత్వ భవనం పూర్తిగా చెట్లు, పొదలతో కప్పబడి నిర్లక్ష్యానికి గురైన దుస్థితి వెలుగులోకి వచ్చింది. భవనం ప్రాంగణంలో గడ్డి పెరిగిపోవడంతో శుభ్రత లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాములు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.