విద్యుత్ సిబ్బందికి రక్షణ కవచాలు అందజేత
SRCL: విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో ఎన్పీడీసీఎల్ ముందడుగు వేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి రక్షణ కవచాలు అందించింది. లైన్‌లో విద్యుత్ సరఫరా ఉంటే తెలిసిపోయేలా ఎర్త్ రాడ్లతో పాటు హెల్మెట్లు, జాకెట్‌లు పంపిణీ చేశారు.