బీ.ఈ.డీ పరీక్షలు వాయిదా
SKLM: ఈనెల 27వ తేదీ నుంచి జరగాల్సిన బీ.ఈ.డీ మొదటి సెమిస్టర్ పరీక్షలు పరిపాలన పరమైన కారణాల వలన వాయిదా పడినట్లు శ్రీకాకుళం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డా.ఎస్. ఉదయ భాస్కర్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.