VIDEO: ఎమ్మెల్యే సార్ నా ఇల్లు కూలిపోయింది.. మహిళ ఆవేదన

KRNL: ఆదోని అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన అరికెర బుజ్జమ్మ భారీ వర్షాలతో మంగళవారం గుడిసె కూలిపోవడంతో నిరాశ్రయురాలైంది. భర్తలేని ఒంటరి మహిళగా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న ఆమె, ఇప్పుడు ఆరుబయట వంట చేసుకుంటూ బతికే స్థితికి చేరింది. ఉన్న గూడు కూలిపోవడంతో పూర్తిగా అనాధగా మారిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇల్లు కల్పించాలని ఎమ్మెల్యే పార్థసారధిని కోరారు.