సీనియర్ సిటిజన్స్‌కు కీలక సూచనలు
విశాఖపట్నం పోలీసులు సీనియర్ సిటిజన్స్‌కు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, అపరిచిత వ్యక్తులకు డెబిట్/ క్రెడిట్ కార్డ్స్ నంబర్, సీవీవీ లేదా ఓటీపీలు వంటివి షేర్ చేయవద్దని తెలియజేశారు. గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.