VIDEO: మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్
WGL: మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. బట్టలు చించుకుని, హార్వెస్ట్ వాహనంకు అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని, అడ్డు వచ్చిన వారిపై దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటన సోమవారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లకుంట తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆగోత్ రవి మద్యానికి బానిసై తరచూ గొడవలకు దిగుతాడని స్థానికులు తెలిపారు.