సైకిల్‌పై వందేళ్ల కుర్రాడు విహారయాత్ర

సైకిల్‌పై వందేళ్ల కుర్రాడు విహారయాత్ర

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని మున్నంగికి చెందిన వంగా రామలింగారెడ్డి అనే 98 ఏళ్ల వృద్ధుడు ఎక్కడికెళ్లినా సైకిల్‌పైనే ప్రయాణిస్తున్నారు. ఈయనకు రక్తపోటు, మధుమేహం వంటి వ్యాదులు లేవని పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి జన్యువులతోపాటు జీవనశైలి కూడా కారణమని ఆయన వివరించారు. స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న సమయానికి తన అన్నదమ్ములలో ఈయన చిన్నవాడినని తెలిపారు.