బైకులు ఢీ.. ఇద్దరు యువకులు మృతి
ASR: అరుకులోయలో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. డుంబ్రిగుడ(M) గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హుకుంపేట(M) గుడుగుపల్లికి చెందిన మువ్వల శ్రీను(28), అరకులోయ (M) మాదల పంచాయతీ తోటవలసకు చెందిన కిల్లో జోసెఫ్(23)లుగా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అరుకులోయ ఆసుపత్రికి తరలించారు.