కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సత్యసాయి: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి జిల్లాలో 5000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైనట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు.