టీచ్ టూల్ ట్రైనింగ్‌కు విధిగా హాజరు కావాలి

SKLM: టీచ్ టూల్ ట్రైనింగ్‌కు విధిగా హాజరు కావాలని సమగ్ర శిక్ష ఎఎంఓ గుంట లక్ష్మీనారాయణ అన్నారు. సోంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఆయన శనివారం సందర్శించారు. జూలై 1 నుండి 9 రోజుల పాటు, జిల్లాలో వివిధ మేనేజ్మెంట్లకు చెందిన 742 మంది స్కూల్ హెడ్స్‌కు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో టీచ్ టూల్ అబ్జర్వేషన్‌పై శిక్షణ నాలుగు కేంద్రాల్లో ఉంటుందన్నారు.