ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు అరెస్ట్

ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు అరెస్ట్

NLR: కలిగిరి మండలం తూర్పు దోబగుంటలోని అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచంద్రాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఉమా శంకర్ అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నిందితులు అజిత్ రెడ్డి శ్రీహరి నిరంజన్ రాజేష్‌గా గుర్తించారు. వారిపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.