'యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండండి'

'యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండండి'

GDWL: జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై పోలీసులు నిఘా పెంచారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల సీఐ శ్రీను, ఇటిక్యాల SI రవి హెచ్చరించారు. బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలై, ఇటీవల ఓ యువకుడు మహిళను హత్య చేసిన ఘటనను వారు గుర్తుచేశారు. యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.