VIDEO: 'సారూ.. పర్వతాపురం రోడ్డు వైపు చూడండి'

VIDEO: 'సారూ.. పర్వతాపురం రోడ్డు వైపు చూడండి'

KRNL: ఆదోని పట్టణ శివారు పర్వతాపురం రోడ్డు దుర్భరంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ అధికారుల స్పందన కరవైంది. నిత్యం ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేశ్వర్లు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యేను కలిసినా ప్రయోజనం లేదన్నారు.