కర్రలతో దాడి.. యువకుడికి గాయాలు

కర్రలతో దాడి.. యువకుడికి గాయాలు

ATP: గుత్తి పట్టణంలోని పాత స్టేట్ బ్యాంకు వద్ద పాత కక్షల కారణంగా మస్తాన్ అనే యువకుడుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.