తగ్గిన మద్యం విక్రయాలు..!

తగ్గిన మద్యం విక్రయాలు..!

VZM: జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల మద్యం అమ్ముడేనట్లు అధికారులు తెలిపారు. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. అయితే, 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 2 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, 2024-25 కంటే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడు పోవడం గమనార్హం.