VIDEO: మహిళ ఫోటోతో క్షుద్ర పూజల కలకలం

VIDEO: మహిళ ఫోటోతో క్షుద్ర పూజల కలకలం

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో మంగళవారం క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. గ్రామ శివారులోని కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఒక మరి చెట్టు కింద మద్దె బోయిన కవిత అనే మహిళ పాస్ ఫోటోను ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు కవిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.