భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్!
GDWL: అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ పదవికి కే.శకుంతలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా ఆమె భర్త చిన్న బీముడు ఉప సర్పంచ్‌గా ఎంపికయ్యారు. గ్రామ ప్రజలు, వార్డ్ మెంబర్ల ఏకగ్రీవ నిర్ణయంతో నాయకత్వాన్ని స్థిరపరుస్తూ ఈ ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. దీంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.