నగరానికి ప్రతిష్టాత్మక అవార్డు..!

నగరానికి ప్రతిష్టాత్మక అవార్డు..!

HYD: తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. హైదరాబాద్ నగరం “సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిషియేటివ్” అవార్డు అందుకుంది. సుస్థిర నగర రవాణా విధానాలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం చూపిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ విజయానికి టీజీ–రెడ్కో (TGREDCO) చేసిన కృషి కీలకమైంది.