ఆటల్లో గెలుపోటములు సహజం: తుడా ఛైర్మెన్

ఆటల్లో గెలుపోటములు సహజం: తుడా ఛైర్మెన్

TPT: తుకివాకం వద్ద జరిగిన వార్షిక క్రీడోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, టీం భావనను పెంపొందిస్తాయన్నారు. గెలుపోటములకన్నా క్రీడాస్ఫూర్తి ముఖ్యమని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను సత్కరించగా, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.