'పిల్లల ఆరోగ్యం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

'పిల్లల ఆరోగ్యం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంను కలెక్టర్‌ హరిత మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు రికార్డులను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలన్నారు.