'యువత పుస్తక పఠన అలవర్చుకోవాలి'

KNR: విద్యార్థులు, యువతరం పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తద్వారా జ్ఞానం పెంపొందుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెధిర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు.