గిద్దలూరులో 'తిరంగా ర్యాలీ'

గిద్దలూరులో 'తిరంగా ర్యాలీ'

ప్రకాశం: గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో తిరంఘా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నారాయణ ఎంతో మంది పౌరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి పౌరుడు తమ గృహం మీద జాతీయ పతాకం ఆవిష్కరించాలని కోరారు. దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు.