మణుగూరు ఆర్టీసీ డిపోలో సమ్మె

BDK: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. బుధవారం మణుగూరు మండలం ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.