నేడు ఇందిరాపార్క్ దగ్గర టీబీజేపీ ధర్నా
TG: రాష్ట్రంలో 'కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం' పేరిట తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. ధర్నాలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొననున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ధర్నా కొనసాగుతుందని పేర్కొన్నారు.