దేశ రక్షణ సేవలో తండా యువకుడి అడుగు
NDL: బేతంచెర్ల మండలం గోరుమానుకొండ తండాకు చెందిన పాపారాయుడు నాయక్, పార్వతి బాయి దంపతుల కొడుకు వినోద్ కుమార్ నాయక్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CISFకు ఎంపికయ్యారు. వినోద్ కుమార్ నాయక్ను పలువురు నాయకులు, గ్రామస్థులు అభినందించారు. తమ కుమారుడు దేశ రక్షణ సేవలో అడుగు పెట్టడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.