ములుగు జిల్లాలో భారీ వర్షం

MLG: జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ప్రభావం ఉండగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో వాన దంచి కొడుతోంది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడి తీవ్రంగా ఉక్కపోపస్తోంది.