జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిచిన ఎమ్మెల్యే
HNK: ఆత్మకూరు మండలం అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్రాగునీరు, వైద్య సేవలు, భద్రతా బందోబస్తు, లైటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని తెలిపారు.