ఈనెల 12 నుంచి ఉరుసు మహోత్సవాలు ప్రారంభం
CTR: బైరెడ్డిపల్లి మండలం బాపలనతంలో ఈనెల 12 నుంచి ఉరుసు మహోత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉరుసుకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. 12న గంధం, 13న ఉరుసు-ఖవాలి, 14న తహలీల్ ఫతేహ జరుగుతుందని చెప్పారు. 3 రోజులపాటు జరిగే ఈ మహోత్సవంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.