అనుమతి లేకుండ చేపల లూటీ
KMM: కారేపల్లి మండల పరిధిలోని దుబ్బతండాలో చెరువులోని చేపల లూటీ వ్యవహారం గ్రామాన్ని ఉద్రిక్తతలోకి నెట్టింది. అనుమతి లేకుండా చేపలు పట్టడం పై రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, ఘర్షణ దారి తీసింది. చెరువులో అక్రమంగా చేపలు పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఒక వర్గం దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయగా, మరో వర్గం ప్రతిస్పందనతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.