విజయనగరంలో క్యాండిల్ ర్యాలీ
VZM: దేశ భద్రత, శాంతి కాపాడడంలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఎస్పీ దామోదర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు విధుల్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.