అమీన్ పీర్ దర్గా అభివృద్ధి కోసం సీఎంకు వినతి

అమీన్ పీర్ దర్గా అభివృద్ధి కోసం సీఎంకు వినతి

కడపలో ప్రముఖ అమీన్ పీర్ దర్గా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును దర్గా పీఠాధిపతి హజరత్ అరిపుల్లా హుస్సేన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం సీఎంను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. దర్గా అభివృద్ధికి కృషి చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అభివృద్ధికి సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు వారన్నారు.