ఆదోని జిల్లా సాధనకు నేడు బంద్.. వైసీపీ మద్దతు

ఆదోని జిల్లా సాధనకు నేడు బంద్.. వైసీపీ మద్దతు

కర్నూలు: ఎమ్మెల్యే విరూపాక్షి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు జరగబోయే బంద్‌కు పూర్తిగా మద్దతు తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం పూర్తిగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. జిల్లా సాధనకు వైసీపీ తరఫున మద్దతు తెలుపుతూ జిల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.