నేషనల్ హైవే అధికారులు ప్రమాద స్థలాల పరిశీలన

BDK: చండుగొండ మండలం మద్దుకూరు హై స్కూల్ మలుపు వద్ద పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్టి విషయాన్ని స్థానికులు పలుమార్లు అధికారులకు వినతులు అందజేశారు. శనివారం నేషనల్ హైవే అధికారులు స్థలాన్ని పరిశీలించి, ప్రస్తుతానికి తాత్కాలిక బోర్డులను ఏర్పాటు చేసి త్వరలోనే శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.