సృష్టి క్షేత్రం ఆటంకాలు తొలగాలని ప్రత్యేక పూజలు

సృష్టి క్షేత్రం  ఆటంకాలు తొలగాలని ప్రత్యేక పూజలు

AKP: నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద నిర్మిస్తున్న108 అడుగుల శివపార్వతుల సృష్టి క్షేత్రం పనులు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంకల్పంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు తొలగాలని ఆలయ కమిటీ, టీడీపీ నేతలు పాలాభిషేకాలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం తగదని నాయకులు అన్నారు.