VIDEO: బీరు సీసాలో ఫంగస్.. ఆందోళనలో మద్యం ప్రియులు

WGL: బీరు సీసాలో ఫంగస్ వచ్చిన ఘటన శనివారం పర్వతగిరి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్ షాపులో ఓ వ్యక్తి బీరు బాటిల్ కొని తీరా తాగుదామని ఓపెన్ చేసే సమయానికి అందులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరీక్షించి చూడటంతో అందులో ఫంగస్ ఉంది. షాపు వారిని అడిగితే తమకు సంబంధం లేదని అంటున్నారని వాపోయాడు.