కారు, లారీ ఢీ.. కౌన్సిలర్ మృతి

KDP: బ్రహ్మంగారిమఠం జెడ్ కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మృతడు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ బాషాగా గుర్తించారు. క్షతగాత్రులను 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.