VIDEO: వాగులు ఎండిపోతున్నాయి
NRPT: కోస్గి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వాగులు నీరు లేక ఎండిపోతున్నాయి. నెల క్రితం జలకళతో కనిపించిన వాగులు ఇప్పుడు అడుగంటి పోయాయి. పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే మేలో తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీరు తగ్గడంతో సమీప బోర్లలో వాటర్ లెవెల్స్ కూడా పడిపోతున్నయన్నారు.