'20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం'
PLD: పరాభవ నామ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదలపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు యువతకు అందించినట్లు, అంతేకాకుండా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో, 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.