నేడు పొదిలిలో డైయల్ యువర్ డీఎం కార్యక్రమం
ప్రకాశం: పొదిలి ఆర్టీసీ డిపోలో ఇవాళ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శంకర్‌రావు తెలిపారు. పొదిలి డిపో పరిధిలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి కొరకు ప్రయాణికులు 9959225700కు కాల్ చేసి తెలియపరచాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.