మాజీ సర్పంచ్‌కు నివాళులర్పించిన మంత్రి

BPT: పంగులూరు మండలం తూర్పు తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ పచ్చ శ్రీనివాసరావు సోమవారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆయన పార్థివదేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.