గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
JGL: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్, కొండ్రికర్ల గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దాపూర్లో సుమలత -జీవన్ రెడ్డి, కొండ్రికర్ల గ్రామంలో మెండే రమేష్లను సర్పంచులుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.