దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్

విజయవాడలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా భారీగా అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలో ఓ ఫ్లాట్, తాడేపల్లిలో ఓ G+2 భవనం, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ. 1.15 లక్షల నగదు, బ్యాంకులో రూ. 3 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు.