చంద్రగిరి హైవేపై కారు బోల్తా
TPT: తిరుపతి జిల్లా చంద్రగిరి హైవేపై లారీని తప్పించబోయిన కారు బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బంగారుపాళ్యం మండలం మంగళపల్లికి చెందిన నరేంద్ర, సురేంద్ర గాయపడగా, వారిని 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.